ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల‌కు అలర్ట్‌.. 14 నుంచి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌

-

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి వేగవంతం చేసింది. తుది రాత పరీక్షల ఫలితాలను ఇటీవల వెల్లడించిన మండలి. ఆ తర్వాతి దశపై దృష్టి సారించింది. రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను ఈ నెల 14 నుంచి 26వ తేదీ వరకు పరిశీలించాలని నిర్ణ యించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతి కేంద్రానికి అదనపు ఎస్పీ స్థాయి అధికారిని పర్యవేక్ష కుడిగా నియమించనుంది.

TSLPRB Recruitment 2022: SCT Sub Inspector IT&CO, PTO and SCT Assistant Sub  Inspector FPB Syllabus | Sakshi Education

ఆదిలాబాద్, సైబ‌రాబాద్, హైద‌రాబాద్, రాచ‌కొండ, క‌రీంన‌గ‌ర్, ఖ‌మ్మం, కొత్తగూడెం, మ‌హ‌బూబాబాద్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, నాగ‌ర్‌క‌ర్నూల్, గ‌ద్వాల్, న‌ల్లగొండ, నిజామాబాద్, రామ‌గుండం, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వ‌రంగ‌ల్ లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్, ఎస్పీ ఆఫీస్, క‌మిష‌న‌రేట్.. కేంద్రాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని, ఇప్పటికే వెరిఫికేషన్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news