ఈ నెల 27న ఇండియాకు రానున్న Xiaomi Pad 5.. స్పెసిఫికేషన్లు ఇవే..!

-

షియోమీ నుంచి.. ఇండియన్ మార్కెట్ లోకి టాబ్లెట్ రానుంది. ఈ సంస్థ దాదాపు ఏడేళ్ల తర్వాత.. ఇండియాలో టాబ్లెట్ ను లాంచ్ చేస్తుంది. Xiaomi Pad 5 పేరుతో ఇది ఈ నెల 27 న విడుదల కానుంది. ఫ్లాగ్‌షిప్ మొబైల్ షియోమీ 12 ప్రోతో పాటు Xiaomi Pad 5ను ఆ సంస్థ లాంచ్ చేయనుంది. షియోమీ ప్యాడ్ 5 చైనాతో పాటు గ్లోబల్‌గా గతఏడాది విడుదలైంది.. ఇప్పుడు ఇండియాకు వస్తోంది. మరి ఇండియాలో దీని ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దామా..

భారత్‌లో Xiaomi Pad 5 ధర (అంచనా)

6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉన్న షియోమీ ప్యాడ్ 5 ధర యూరోపియన్ మార్కెట్‌లో 349 యూరోలు అంటే.. సమారు రూ.30,300.
6జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర 399 యూరోలు (సుమారు రూ.34,600)గా ఉంది. అయితే భారత్‌లో Xiaomi Pad 5 బేస్ వేరియంట్ ధర రూ.24,000, టాప్ మోడల్ ధర రూ.27,600గా ఉంటుందని టెక్ నిపుణల అంచనా.

షియోమీ ప్యాడ్ 5 హైలెట్స్..

గ్లోబల్‌గా విడుదలైన స్పెసిఫికేషన్లతోనే దాదాపు భారత్‌లోనూ షియోమీ ప్యాడ్ 5 విడుదలయ్యే అవకాశం ఉంది.. 11 ఇంచుల WQHD+ ట్రూటోన్ డిస్‌ప్లేతో ఈ ట్యాబ్ వస్తోంది.
120Hz రిఫ్రెష్ రేట్, 16:10 యాస్పెక్ట్ రేషియో, డాల్బీ విజన్, హెచ్‌డీఆర్ 10 సపోర్ట్ ఉంటాయి. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెసర్‌తో ఈ ట్యాబ్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 11తో కూడిన ఎంఐయూఐ 12.5 ఓఎస్‌తో వస్తుంది.
Xiaomi Pad 5 వెనుక 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీనికి ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. ఇక వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను షియోమీ పొందుపరిచింది.
Xiaomi Pad 5 ట్యాబ్‌లో 8,720mAh బ్యాటరీ ఉంటుంది. 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండే నాలుగు స్పీకర్లతో ఈ ట్యాబ్ వస్తోంది.
వైఫై, బ్లూటూత్ వీ5, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఆప్షన్లుగా ఉన్నాయి.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news