BREAKING : కేజీఎఫ్‌ 2 నుంచి మదర్‌ సాంగ్‌ రిలీజ్‌

-

కేజిఎఫ్ 2 శాండిల్ వుడ్ గౌరవాన్ని జాతీయస్థాయిలో తీసుకువెళ్లిన సినిమా. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ పిక్చర్ తో హీరో యాష్ ఎక్కడికో వెళ్లిపోయాడు.సౌత్ స్టార్ హీరోగా నోటెడ్ అయ్యాడు. ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం దేశవ్యాప్తంగా సినీ జనాలను ఎదురుచూసేలా చేశారు.

ఫ్రేమింగ్ నుంచి డైలాగ్స్ వరకు ప్రతీది సాలిడ్ గా సెట్ అయింది. ఇక కేజీఎఫ్‌ 2 సినిమా కూడా.. షూటింగ్‌ పూర్తి చేసుకుని… విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా కేజీఎఫ్‌ 2 సినిమాలో మదర్‌ సాంగ్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఎదగరా.. ఎదగరా అనే లిరిక్స్‌ తో.. ప్రారంభం అయ్యే ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. కేజీఎఫ్‌ 1 లోని బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజికే ఈ పాటకు జోడించడంతో.. అందరి మనసులు దోచుకుంటోంది. కాగా.. కేజీఎఫ్‌ 2 సినిమా ఏప్రిల్‌ 14 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news