సూపర్ స్టార్ మహేష్ బాబు- డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన పోకిరి, బిజినెస్ మేన్ బ్లాక్ బస్టర్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. మహేష్ కు సూపర్ స్టార్ ఇమేజ్ ను అందించడం లో పోకిరి కీలక పాత్ర పోషించింది. తెలుగు సినిమా చరిత్రలో భారీ వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా అప్పట్లోనే ఓ రికార్డు క్రియేట్ చేసింది. దీంతో మహేష్ ఇమేజ్ ఒక్కసారిగా ఆకాశాన్నటింది.నిజానికి పూరి ఆసక్సెస్ ఇవ్వకపోయుంటే మహేష్ కథ వేరుగా ఉండేది. మహేష్ లో నటుడిని బయటకు తెచ్చిందే పూరి. అటుపై బిజినెస్ మేన్ తో సౌత్ లోనే క్రేజీ స్లార్ అయ్యాడు.
ఆ సినిమా కి నేటికి ప్రత్యేకమైన అభిమానులున్నారు. మహేష్ ట్యాలెంట్ ని-పూరి క్రియేటివిటీని చాటి చెప్పిన మరో అద్భుతమది. అలాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన పూరికి నేడు మహేష్ అవకాశం ఇవ్వడానికే వెనుకడుగు వేస్తున్నాడు. ఆ మధ్య మహేష్ తో జనగణమన సినిమా చేస్తున్నట్లు పూరి సగర్వంగా ప్రకటించాడు. కానీ తర్వాత సన్నివేశం తారుమారైంది. పూరి అప్ డేట్స్ తెలుసుకున్న మహేష్ వేరే దర్శకులకు డేట్లు కేటాయించి పూరికి షాకిచ్చాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య పొరపొచ్చాలొచ్చినట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటీవలే పూరి వ్యాఖ్యలను బట్టి ఆ వివాదం మరింత పీక్స్ కు చేరుకుంది. భవిష్యత్ లో మహేష్ తో సినిమా చేయనని సంచలన ప్రకటన చేసాడు పూరి.
ఇప్పుడు ఆ కసితోనే మహేష్ కి పోటీగా మరోస్టార్ ని దించుతున్నట్లు పూరి కేవ్ వర్గాల నుంచి తెలిసింది. పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ తో సంచలనం సృష్టించిన కన్నడ నటుడు యశ్ తో జనగణమన తెరకెక్కించడానికి సన్నాహాకాలు చేస్తున్నాడుట. ఇప్పటికే కథ కూడా వినిపించాడని సమాచారం. యశ్ నుంచి గ్రీన్ సిగ్నెల్ వచ్చేసిందిట. తెలుగు, కన్నడ భాషల్లో చిత్రాన్ని తెరకెక్కించనున్నారుట. టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ దీన్ని నిర్మించనుందని సమాచారం. ఇక యశ్ క్రేజ్ విషయానికి వస్తే కేజీఎఫ్ చాప్టర్ -1 హిట్ తో సౌత్ లోనే క్రేజీ స్టార్ అయ్యాడు. కన్నడ సహా తెలుగు, తమిళ భాషల్లోనూ కేజీఎఫ్ కలెక్షన్ల మోత మ్రోగించింది. వరల్డ్ వైడ్ గా సినిమా 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఒక్క తెలుగులోనే ఊహించని వసూళ్లను తెచ్చి పెట్టింది. ఆ నమ్మకంతోనే మహేష్ తో ప్లాన్ చేసిన జనగణమని యశ్ తో చేయడినికి పూరి రెడీ అవుతున్నాడు.