యశోద సినిమా నుంచి బిగ్ అప్డేట్..సమంత ఫ్యాన్స్ కు ఇక పండగే

-

బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత..అక్కినేని నాగచైతన్యతో డైవోర్స్ తర్వాత తన ప్రొఫెషనల్ కెరీర్ పైన ఫుల్ ఫోకస్ పెట్టింది. వరుస సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంది ఈ టాలెంటెడ్ హీరోయిన్. ‘పుష్ప’ చిత్రంలో ఐటెం సాంగ్ చేసిన సమంత..వినూత్నమైన స్టోరిలను ఎంచుకుని పిక్చర్స్ చేస్తోంది. ఇటీవల ఆమె నటించిన ‘కాతు వాకుల రెండు కాదల్’ ఫిల్మ్ రిలీజ్ మంచి పేరు సంపాదించుకుంది.

కాగా,ప్రస్తుతం సమంత నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘‘యశోద’. ఈ ‘యశోద’ పిక్చర్ లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్, ఉన్నీ ముకుంద‌న్ కీలక పాత్రలు పోషిస్తుండగా, మెలోడీ బ్రహ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.

శ్రీదేవీ మూవీస్ బ్యానర్ పై శివ‌లెంక కృష్ణ ప్రసాద్ పిక్చర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ..తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్, కన్నడ, మ‌ల‌యాళం భాష‌ల్లో ఈ ఏడాది ఆగ‌స్టు 12న విడుద‌ల చేయాల‌ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే.. వినాయక చవితి నేపథ్యంలో ఈ సినిమా నుంచి బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్‌ 9 వ తేదీన సాయంత్రం 5.49 గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు స్వయంగా సమంత తన ట్విట్టర్‌ ద్వారా పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news