తెలుగు తమ్ముళ్ళు-జనసైనికులకు అలెర్ట్..’ఫ్యాన్స్’ ఫేక్?

-

మీడియాలో గాని, సోషల్ మీడియాలో గాని ఫేక్ ప్రచారం చేసి ప్రత్యర్ధి రాజకీయ పార్టీలని దెబ్బకొట్టడంలో వైసీపీ ఆరితేరిపోయిందని టీడీపీ శ్రేణులు స్ట్రాంగ్ గా చెబుతున్నాయి. గత ఎన్నికల ముందు అలాగే ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి తమ పార్టీని దెబ్బకొట్టారని, వైసీపీ ఫేక్ ప్రచారాన్ని తాము కూడా సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోయామని, దాని వల్ల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామని తమ్ముళ్ళు గుర్తు చేస్తున్నారు.

అలాగే ఎన్నికల ముందు టీడీపీ-జనసేన శ్రేణుల మధ్య చిచ్చు పెట్టారని, కమ్మ-కాపు క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి రచ్చ లేపారని, వైసీపీ శ్రేణులు…టీడీపీ లేదా జనసేన ఫేక్ ఎకౌంట్లతో వచ్చి..ఒకరికొకరు గొడవ పడేలా చేశారని, మళ్ళీ ఇప్పుడు అదే చేయడానికి వైసీపీ ప్రయటానిస్తుందని కాబట్టి అలెర్ట్ గా ఉండాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా చంద్రబాబు-పవన్ కలిసిన నేపథ్యంలో మళ్ళీ టీడీపీ-జనసేన శ్రేణులు కలవకుండా చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తారని, వారి ప్రచారాన్ని తిప్పికొట్టాలని రెండు పార్టీల శ్రేణులు చర్చించుకుంటున్నాయి.

ముఖ్యంగా టీడీపీ ఖాతాల పేర్లతో..పవన్ తమ బానిస అని, తాము ఎన్ని సీట్లు ఇస్తే అన్నే తీసుకోవాలని వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుందని, అలాగే పవన్‌కు సీఎం సీటు ఇవ్వాలని, జనసేన శ్రేణులు ఎంతకాలం టీడీపీ జెండా మోస్తారని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారని కాబట్టి అలెర్ట్ గా ఉండాలని మాట్లాడుకుంటున్నారు. పైగా సంక్రాంతికి బాలయ్య, చిరంజీవి సినిమాలు ఉన్నాయి. ఇద్దరి ఫ్యాన్స్ మధ్య గొడవలు పెట్టి..చివరికి దాన్ని రాజకీయంగా మార్చి టీడీపీ-జనసేన గొడవ మాదిరిగా సృష్టిస్తారని కాబట్టి రెండు పార్టీల వారు జాగ్రత్తగా ఉండాలని తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు సూచించిన విషయం తెలిసిందే. మొత్తానికి వైసీపీ ఫేక్ ప్రచారాన్ని నమ్మవద్దని టీడీపీ-జనసేన శ్రేణులు కోరుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version