పరిమితికి మించి ప్రజలను ఎక్కించిన ఆటో డ్రైవర్ కి వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని క్లాస్ పీకారు. ప్రయాణికులను కూడా పిలిచి ఆమె జాగ్రత్తలు చెప్పారు. ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్నారు. ఈ సమయంలో చిలకలూరిపేట శివారులో ఓ ఆటో జనాలను ఎక్కించుకుని వెళ్తుంది. ఆ ఆటో చూసి ఎమ్మెల్యే షాక్ అయ్యారు. అందులో పరిమితికి మించి ప్రయాణికులు,
ఉండటం గమనించిన ఆమె కారు పక్కకు ఆపి దిగారు. ఆటోలో ఉన్న వాళ్ళను దించారు. లేక్కపెట్టగా మొత్తం 18 మందిని లోపల ఎక్కిన్చినట్టు గుర్తించడం, వారిలో అందరూ మహిళలే ఉండటంతో ఎమ్మెల్యే ఆశ్చర్యం వ్యక్తం చేసి, 5 మందిని ఎక్కించే ఆటోలో అంత మంది ప్రయాణికులు ఎందుకు అంటూ ఆటో డ్రైవర్ పై ఆమె ఆగ్రహ౦ వ్యక్తం చేసి చర్యలు తీసుకోవాలా అంటూ ప్రశ్నించారు.
ఆటోలో ప్రయాణిస్తున్న మహిళల్ని పిలిచి రజని అసహనం వ్యక్తం చేసి, ఇలా ప్రయాణించడం సురక్షితం కాదన్న ఆమె ఇంట్లో బిడ్డలు ఎదురుచూస్తూ ఉంటారని, అనుకోని ఘటన జరిగితే బాధ్యత ఎవరిదని నిలదీశారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకుండా చూడాలని పోలీసులకు కూడా ఒకరకంగా క్లాస్ పీకారు. ఇంకోసారి ఇలా జరిగితే ఆటో సీజ్ చెయ్యాలని అధికారులకు సూచించారు ఆమె.