బ్రేకింగ్; రెండు దశలుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు…!

-

పార్లమెంట్ సమావేశాలను రెండు దశల్లో నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాల కమిటి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను రామనాథ్ కోవింద్ కి పంపగా, ఆయన రెండు సభలను ఇందుకు అంగీకరించారు. బడ్జెట్ సమావేశాల్లో తొలి విడతను జనవరి 31 నుంచీ ఫిబ్రవరి 11 వరకూ… రెండో విడతను మార్చి 2 నుంచీ ఏప్రిల్ 3 వరకూ నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం.

ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ తన రెండో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. GDP వృద్ధి రేటు పడిపోవడం, ఆటోమొబైల్ సెక్టార్ మూలనపడిటం, ధరలు పెరగడం వంటివి ప్రభుత్వానికి గుదిబండగా మారాయి. ఇప్పుడు ఈ అంశాలను విపక్షాలు టార్గెట్ చేసే అవకాశం ఉంది. దీనితో బడ్జెట్ సమావేశాలు అనేవి ప్రశాంతంగా జరిగే అవకాశాలు కనపడటం లేదు.

ప్రస్తుత ఎన్డియే ప్రభుత్వంలో ఆర్ధిక నిపుణులు ఎవరూ లేరని, నిర్మలా సీతరామన్ కు అనుభవం లేకపోవడంతో పరిస్థితులు దిగజారుతున్నాయి అనే ఆరోపణలు వినపడుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఈసారి బడ్జెట్ ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇరాన్, అమెరికా వ్యవహారంతో పెట్రోల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అటు సంక్షేమ కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news