ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. విజయనగరం జిల్లా మినహా మొత్తం 12 జిల్లాల్లో 3249 పంచాయతీలలో పోలింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మంచి పోలింగ్ శాతం నమోదయింది.
జిల్లాల వారీగా పోలింగ్ శాతం 81.66 శాతం పోలింగ్.. శ్రీకాకుళం 77.04%,విశాఖపట్నం 82.86%, తూర్పుగోదావరి 82.80%, పశ్చిమగోదావరి 80.29%, కృష్ణ 85.06%, గుంటూరు 83.04%, ప్రకాశం 75.41%, నెల్లూరు 80.62%, చిత్తూరు 83.47%, కడప 76.63%, కర్నూలు 83.55%, అనంతపురం 82.30% శాతం పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో వైసీపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ దారుణమైన రీతిలో సీట్లు గెలుచుకుంటోంది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు వైసీపీ మద్దతుదారులు విజయంతో వైసీపీ కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి. ఈ సంబరాలకు మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు.