ఆలయ ఈవోనే బెదిరిస్తున్న వైసీపీ నేత…!

ఆలయ ఈవోను వైసీపీ నేత ఒకరు బెదిరించడం సంచలనంగా మారింది. తిరుపతి సమీపంలోని సురుటుపల్లి పల్లి కొండేశ్వర ఆలయ ఈవో మురళి కృష్ణ కు వై.సి.పి నేత ఆలయ మాజీ చైర్మన్ మునిశేఖర్ రెడ్డి నుంచి బెదిరింపులు వస్తున్నాయి. గత పది రోజులుగా ఆలయ మాజీ చైర్మన్ మునిశేఖర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారు అని ఈవో ఆవేదన వ్యక్తం చేసారు.

గత సంవత్సరం శారద నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఉబయదారుడు మధు రెడ్డి ని తొలగించి తన బావని ఉబయదారుడుగా నియమించాలని ఒత్తిడి చేసారని… దీనిపై దేవాదాయశాఖ సహాయ కమిషనర్ ఆలయానికి వచ్చి విచారణ చేపట్టారని… ఈ విచారణ లో ఉబయధారుడిని మార్చే హక్కు ఎవరికి లేదని స్పష్టం చేశారని ఆయన వివరించారు. అయినా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉబయదారుడిని మార్చాలని మళ్లీ మునిసేకర్ రెడ్డి ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఇందుకు ఒప్పుకోక పోవడంతో గత 10 రోజులుగా నా అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఈవో కన్నీరు పెట్టుకున్నారు.