జగన్ ని చికాకు పెట్టేస్తున్నారుగా…!

-

ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉందీ అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పార్టీలో ఉండే నేతలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇష్టం వచ్చినట్టు చేస్తే అంతిమంగా ఇబ్బంది పడేది పార్టీ. ఈ విషయాన్ని కూడా అధికార పార్టీ నేతలు తెలుసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. సరైన సమయంలో ముఖ్యమంత్రి జగన్ కి అండగా నిలబడలేక అవస్థలు పడుతున్నారు కొందరు.

ఆధిపత్య పోరుతో పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఓడిపోయిన వాళ్ళు ఇలా ఎవరు చూసినా సరే ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. నర్సారావు పేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి… గోదావరి జిల్లాల్లో ఇద్దరు మంత్రులు,

ఇలా చూసుకుంటూ పోతే చాలా మంది జగన్ ని ఇబ్బంది పెడుతున్నారు అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. ఒకరి నియోజకవర్గాల్లో మరొకరు వేలు పెట్టడమే కాకుండా అనవసర పెత్తనాలు చేస్తున్నారు. నా నియోజకవర్గంలో ఎంపీ వ్యాపారాలు చేయడం ఏంటీ అంటూ ఎమ్మెల్యే, నా నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటీ అంటూ ఎమ్మెల్యే, నా నియోజకవర్గంలో ఇంచార్జ్ మంత్రి పెత్తనం ఏంటీ అంటూ నియోజకవర్గ ఇంచార్జ్.

ఇలా ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేయడం, అనవసర రాజకీయాలు చేయడంతో అంతిమంగా పార్టీ ఇబ్బంది పడుతుంది. రాజకీయం అనేది ఇప్పుడు చెయ్యాల్సిన అవసరం ఉన్నా ఆధిపత్యం అనేది అధికార పార్టీలో అవసరం లేదు. ఒక్కసారి కార్యకర్తలు గనుక చీలిపోతే వాళ్ళు దగ్గరవ్వడం అనేది చాలా కష్టం. అందుకే టీడీపీ అధికారం కోల్పోయింది ఈ విషయం తెలుసుకోకపోతే అధికార పార్టీ ఇబ్బంది పడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version