హైటెక్ సిటీ వద్దనున్న సైబర్ టవర్ రోడ్డు ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం మత్తులో కారును నడిపిన కాశీ విశ్వనాథ్, కౌశిక్ లు సిగ్నల్ జంప్ చేసి సరిగ్గా వెళ్తున్న బైక్‌ను ఢీ కొట్టి ఒక కుటుంబాన్ని నాశనం చేశారు. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న గౌతమ్ అక్కడిక్కడే చనిపోగా ఆయన భార్య శ్వేత హస్పటల్‌లో చికిత్స పొందుతుంది. ప్రమాదానికి కారణమైన కారు రాయల సీమ కు చెందిన ఎమ్మెల్యే కుమారినిదని పోలీసులు గుర్తించారు. కాటసాని ఓబుల్ రెడ్డి పేరుతో కారు రిజిస్టర్ అయింది.
కేసు దర్యప్తులో బాగంగా కారు యజమాని కాటసాని ఓబుల్ రెడ్డికి నోటీసులు పంపనున్నారు పోలీసులు. యాక్సిడెంట్ చేసి కారు అక్కడే వదిలేసి పారిపోయన విశ్వనాథ్, కౌశిక్ లు, కారును వదిలేసి ఓయో రూమ్ లో దాక్కున్నారు. కాశీ విశ్వనాథ్ పై గతంలో అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదయిందని అంటున్నారు. గతంలోనే విశ్వనాథ్ డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చెయ్యాలని రవాణ శాఖకు పోలీసులు పంపించారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పోలీసుల అదులపులో కాశీ విశ్వనాథ్ ఉండగా కౌశిక్ పరారీలో ఉన్నాడు.