కరోన మరో ప్రజాప్రతినిధిని పొట్టన పెట్టుకుంది. కరోనాతో వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందారు. చల్లా రామకృష్ణారెడ్డికి కొంతకాలం క్రితం కరోనా సోకింది. ఆయన కొంతకాలంగా హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. డిసెంబర్ 13వ తేదీన చల్లా రామకృష్ణారెడ్డి అపోలో ఆసుపత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉదయం ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. నిజానికి ఆయన డిసెంబర్ మొదటి వారంలో కూడా ఏపీ శాశన మండలి సమావేశాల్లో పాల్గొన్నారు.
అలంటి ఆయనకు కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేరడం పరిస్థితి విషమించి మరణించడంతో వైసీపీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కర్నూలు జిల్లా రాజకీయాల్లో చల్లా రామకృష్ణారెడ్డికి విశిష్టమైన స్థానం ఉంది. ఈయన 1983లో పాణ్యం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనేక పదవులు అనుభవించిన ఆయన 2014 ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి టికెట్ రాకపోవడంతో టీడీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థి బీసీ జనార్దనరెడ్డిని గెలిపించారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వంలో ఏపీ సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేసి.. వైసీపీ లో చేరారు. వైసీపీ బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారు. దీంతో వైసీపీ ఆయనని ఎమ్మెల్సీని చేసింది.