నిజామాబాద్ జిల్లాలో దిశ తరహా ఘటన

-

నిజామాబాద్ జిల్లా  వర్ని పోలీస్స్టేషన్ పరిధిలోని బడా పహాడ్ బస్టాండ్ వద్ద గుర్తు తెలియని 42 సంవత్సరాల మహిళను  అత్యాచారం చేసి, హత్య చేశారు. అంతే కాక ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖం మీద ఆయిల్ పోసి కాల్చి వేశారు. ఈ సంఘటన జరిగి సుమారు 24 గంటలు అవుతుందని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. పెద్దగుట్ట బస్టాండ్ వెనుక ఉన్న వాగులో మహిళను హత్యచేసి పడ వేశారు.

మహిళను హత్య చేసిన ప్రాంతంలో మద్యం బాటిళ్లు కూడా ఉన్నాయి. సంఘటన స్థలాన్ని పరిశీలించి గుర్తు తెలియని వ్యక్తులు మహిళతో కలిసి వచ్చి మద్యం సేవించి ఆ తర్వాత అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసిన అనంతరం మహిళలను  ఎవరు గుర్తు పట్టకుండా ఉండకుండ  ఆమె ముఖంపై ఆయిల్ పోసి కాల్చివేశారు. హత్యకు పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు డాగ్   క్లూస్ టీం తో ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు.  సంఘటన స్థలానికి వచ్చిన డాగ్   బస్టాండు రామన్న లంక తదితర ప్రాంతాలను తిరిగి వచ్చింది. బోధన్ డిఎస్పి రామారావు సంఘటన స్థలాన్ని పరిశీలించి స్థానిక వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news