భారత్ లో కరోన వ్యాక్సిన్ కి నేడు అనుమతి.. కమిటీ కీలక భేటీ !

-

దేశ ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్ కింద వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం సిద్దం అవుతోంది. రేపటి నుంచి అన్ని రాష్ట్రాల్లో డ్రైరన్ నిర్వహించనున్నారు. ఇక దేశం మొత్తం కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు గాను నిపుణుల కమిటీ భేటీ అయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక అనుమతులు లభించగానే వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి గాను రేపటి నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రై ర‌న్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది.

వ్యాక్సిన్ పంపిణీలో సమస్యలను గుర్తించడమే లక్ష్యంగా ఈ డ్రైరన్ నిర్వహించనున్నారు. టీకా రిహార్సల్ కార్యక్రమంగా తెలిపే ఈ డ్రై రన్‌ను ఇప్పటికే ఏపీతో పాటు పంజాబ్‌, అసోం, గుజరాత్‌ రాష్ట్రాల్లో 28, 29 తేదీల్లో నిర్వహించారు. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో రేపటి రెండు నుంచి డ్రైరన్ నిర్వహించనున్నారు. ఇక దీనికి సంబంధించి భేటీ కానున్న నిపుణుల కమిటీ.. ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. గ్రీన్‌సిగ్నల్ రాగానే.. పంపిణీ ప్రక్రియ మొదలు కానుంది. 

Read more RELATED
Recommended to you

Latest news