టిడిపి అంటేనే దొంగల పార్టీ.. అచ్చెన్నాయుడు ఓ దున్నపోతు : వైసీపీ ఎమ్మెల్సీ

అచ్చెన్నాయుడు పై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సీరియస్ కామెంట్స్ చేశారు. అచ్చెన్నాయుడు తెలుగు దొంగల పార్టీ అధ్యక్షుడు అని.. ఆయన దున్నపోతని మండిపడ్డారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇంతవరకు ఎందుకు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడలేదని.. ఇప్పుడు కొత్తగా ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యకు పరిష్కారంగా మంచినీళ్లు అందించటానికి 750 కోట్లతో ప్రాజెక్టు ప్రారంభించింది సీఎం జగన్ అని కొనియాడారు.

లోకేష్ భాష మార్చుకోకపోతే తాము కూడా ఏకవచనతో పిలుస్తామని హెచ్చరించారు. ఏయ్ లోకేష్… నీకు, పోలవరానికి సంబంధం ఏంటి? ఒరేయ్ చంద్రా…నువ్వు ఏం చేశావురా ? అంటూ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. పోలవరం‌, సుజల స్రవంతి వైఎస్ రాజశేఖరరెడ్డి మానస పుత్రికలు అని.. పోలీసులు, గవర్నర్, సీఎం పై నోటికి వచ్చినట్లు మాట్లాడిన లోకేష్, అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హుదూద్ తుఫాను వస్తే చంద్రబాబు ప్రకృతినే భయపెట్టానని చెప్పుకున్నాడని.. మీరు తెలుగు దొంగల పార్టీ వెధవలు అంటూ పచ్చి భూతులు తిట్టారు. చంద్రబాబు హుదూద్ తుపాను పేరుతో లక్ష ఎకరాలు దోచుకున్నాడని ఆరోపణలు చేశారు.