సంగం డెయిరీ : జగన్ సర్కార్ కు దిమ్మతిరిగే షాక్

సంగం డెయిరీ కేసులో జగన్ సర్కార్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఈ సంగం డెయిరీ కేసులో జగన్ సర్కార్ రీట్ అప్పీల్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంలో దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్ లను కొట్టివేసింది ఏపీ హైకోర్టు. సంగం డెయిరీ ను స్వాధీనం చేసుకోవద్దని జగన్ సర్కార్ కు ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.

highcourt
highcourt

ఈ విషయంలో గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ జగన్ సర్కార్ ఉన్నత న్యాయస్థానం లో అప్పీల్ కు వెళ్ళింది. అయితే తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్… సింగిల్ జడ్జి తీర్పులు సమర్థిస్తూ ప్రభుత్వ రిట్ అప్పీలు తిరస్కరించింది. దీంతో జగన్ సర్కార్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఇక తాజా గా హైకోర్టు తీర్పుపై… దూళిపాళ్ల నరేంద్ర హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు పాడి రైతుల విజయం అన్నారు నరేంద్ర.