రఘురామకృష్ణం రాజుపై చ‌ర్య‌ల‌కు స్పీక‌ర్ ఓకే.. వెల్ల‌డించిన విజ‌య‌సాయి రెడ్డి..!

-

నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మీద అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీకి చెందిన వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ రోజు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళిన వైసీపీ ఎంపీలు,  రఘురామకృష్ణంరాజు మీద స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అనర్హత వేటు వేయాలని కోరారు. లోక్ సభ స్పీకర్ తో దాదాపు 20 నిమిషాల పాటు వారు చ‌ర్చించారు.. అనంతరం వైసీపీ ఎంపీ విజ‌య సాయిరెడ్డి దీని గురించి మాట్లాడుతూ.. వైసీపీ తరఫున ఎన్నికైన రఘురామకృష్ణంరాజు ముఖ్య‌మంత్రి జగన్‌ మీద అసభ్య పదజాలాన్ని వాడుతున్నారని అన్నారు.

వైసీపీలో ఉంటూ మిగిలిన ప్రతిపక్షాలతో మంతనాలు చేస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే ఆయనపై ఫిర్యాదు చేశామన్నారు. రఘురామకృష్ణంరాజు నైతిక విలువలు కోల్పోయారు. ప్రతిపక్షాలతో లాలూచీ పడ్డారు. ఆయన దిగజారుడుతనానికి ఇదే నిదర్శనం. కొన్ని ఊహాజనిత విషయాలను ఊహించుకుంటున్నారు. ఏదైనా ఒక విషయం మీద క్లారిటీ రావాలంటే పార్టీలో అంతర్గతంగా చర్చించాలి. బయటకు రాకూడదు. ఏదైనా అసంతృప్తి, విషయం ఉంటే పార్టీ అధ్యక్షుడికి చెప్పాలి. అంతేకాని రోడ్డుక్కకూడదు. ఒక ఉద్దేశంతో ఆయన ఇదంతా చేశారు.’ అని విజయసాయిరెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news