వైసిపి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు. వైసీపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ఆరోపించారు కేంద్రం నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తమ స్టిక్కర్లు అతికించుకొని ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని అధిష్టానం నిర్ణయం అని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకపోవడంతో ఉత్తరాంధ్ర కరువు ప్రాంతంగా మిగిలిపోయిందని ఆరోపించారు.
పాట్నా వేదికగా విపక్షాల భేటీ తర్వాత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకు సిద్ధం అవుతున్నాయని మండిపడ్డారు. బిజెపికి వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న ప్రయత్నం ఒక ప్రహసనంగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. అవినీతి కూటమి ద్వారా బిజెపిని ఎదుర్కొనేందుకు విపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా బిజెపి దక్షిణాదిలో విస్తరిస్తుందని అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం ఇతర రాష్ట్రాలపై ఏమాత్రం ఉండదని ధీమా వ్యక్తం చేశారు.