వైసీపీలోని రెడ్డి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రెడ్డి వర్గం సీనియర్ నేతల దెబ్బతో జగన్ కేబినెట్లో ఉన్న బీసీ మంత్రులు విలవిల్లాడుతున్నారా ? అంటే అవుననే చర్చలు ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. జగన్ సామాజిక సమీకరణల్లో భాగంగా రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు బలంగా ఉన్న ఓ రెండు జిల్లాల్లో మంత్రి పదవులను బీసీలకు ఇచ్చారు. వీరిద్దరు రాజకీయంగా రెడ్డి వర్గం సీనియర్ ఎమ్మెల్యేలతో పోలిస్తే జూనియర్లు. రాజకీయ చాతుర్యంలోనూ తక్కువ అనుభవం ఉన్న వాళ్లే. తమ జిల్లాలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమ పెత్తనమే ఉండాలే కాని.. వీళ్లు ఎవ్వరు బుడంకాయలు… వీళ్లు చెప్పినట్టు మేం వినాలా ? అని ఆ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు ఈ ఇద్దరు బీసీ మంత్రులను పూచిక పుల్లలా తీసి పడేస్తున్నారు.
ఓ జిల్లాలో సదరు మంత్రిని వదిలేస్తే మిగిలిన జనరల్ నియోజకవర్గాలతో పాటు ఎంపీ కూడా రెడ్డి వర్గం వాళ్లే ఉన్నారు. దీంతో రెడ్లు అంతా ఆ బీసీ ఎమ్మెల్యేపై కత్తి కట్టి మరీ వ్యవహరిస్తుండడంతో పాటు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పెద్ద రెడ్లంతా నాపై కక్ష కట్టారే అని సదరు మంత్రి ఓపెన్‌గానే తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఆయన స్టేట్‌కు మంత్రిగా ఉన్నారు.. అన్ని జిల్లాల్లోనూ స్వేచ్ఛగా పర్యటిస్తున్నారు. అయితే తన సొంత జిల్లాలో తన నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గంలో కాలు పెట్టే సాహసం కూడా చేయడం లేదు. సదరు రెడ్డి ఎమ్మెల్యేలు అందరూ ఆ మంత్రి ఎక్కడ దొరుకుతాడా ? కయ్యం పెట్టుకుందాం ? అని కాచుకుని కూర్చొని ఉన్నారు.
అటు అధినేతకు చెప్పినా సర్దుకుపోవాలని చెప్పడంతో చేసేదేం లేక ఆయన తనలో తానే బాధ దిగమింగుకుని తన పని తాను చేసుకుపోతున్నారు. ఇక మరో జిల్లాలో బీసీ కోటాలో మంత్రి అయిన నేతది ఇదే పరిస్థితి. ఆ జిల్లాలో రెడ్డి ఎమ్మెల్యేలది ఫుల్ డామినేషన్. ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి అయ్యారు. ఇప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ ఆయన్న ఏ మాత్రం లెక్క చేయడం లేదు. పైగా ఆ మంత్రికి వాయిస్ కూడా లేదు. నోరు మొత్తని వ్యక్తి కావడంతో ఆయన రెడ్డి ఎమ్మెల్యేలు డామినేషన్ చేస్తున్నా కిమ్మనకుండా తన పని తాను చేసుకుపోతున్నారట.
సీమలో కీలకమైన ఆ జిల్లాలో రెడ్డి ఎమ్మెల్యేలు అందరూ సదరు మంత్రికి ఫోన్ చేసి మేం చెప్పిన పని ఇంకా ఎందుకు ? అవ్వలేదని హూంకరిస్తున్నారట. సదరు మంత్రి ఈ బాధను ఆ జిల్లాకు ఇన్‌చార్జ్‌గా ఉన్న మరో ఎంపీకి చెప్పుకున్నా ఆయన కూడా లైట్ తీస్కోమని చెప్పడంతో ఆ బీసీ మంత్రి కూడా కక్కలేక మింగలేక ఉంటున్నట్టు టాక్.. ? ఏదేమైనా వైసీపీలో రెడ్ల డామినేషన్ ఎలా ? ఉందో ఈ సంఘటనలే చెపుతున్నాయి.