ఏపీలో వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలంటే భయపడిపోతున్నారు. పోస్టు పెట్టేముందు ఏకంగా తమ ఐడీ ప్రొఫైల్స్‌ను సైతం మార్చుకుంటున్నారు.ఎందుకంటే ఇటీవల ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆడవారిపై బ్యాడ్ కామెంట్స్ చేసిన అస్సలు వదలడం లేదు.
ఇటీవల వైఎస్ షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని, వైఎస్ భారతిని పీఏని సైతం అరెస్టు చేశారు.తాజాగా ఈ అరెస్టులపై ఓ యువతి స్పందిస్తూ..‘నా ప్రొఫైల్ నేమ్ లో YSCRP అని ఉంది.అది చూసి నన్ను కూడా వైయస్సార్సీపి కార్యకర్తలు అనుకోని ఎక్కడ జైల్లో మింగుతారో అని భయమేసి ప్రొఫైల్ నేమ్ చేంజ్ చేసుకున్నా ఫ్రెండ్స్.
ఇన్ని రోజులు అన్నకి సపోర్ట్ చేసి సడెన్ గా ఇప్పుడు ప్రొఫైల్ నేమ్‌లో నుంచి YSCRPను తీసేస్తుంటే, ఒక తల్లి తన బిడ్డను నవమాసాలు మోసి తొమ్మిదో నెలలో అబార్షన్ చేయించుకున్నట్టు..ఎంత బాధ కలుగుతుందో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్’ అని పోస్టు చేసింది.