వైసీపీ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో ‘వంచనపై గర్జన’ దీక్ష చేపట్టేందుకు పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా దేశ రాజధాని నడిబొడ్డున జంతర్‌మంతర్ వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ జరిగే దీక్షలో వైసీపీ నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానులు భారీఎత్తున పాల్గొననున్నారు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో వంచనపై గర్జన దీక్ష చేపట్టినట్లు వైసీపీ పేర్కొంది.వి భజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ని ఇటు చంద్రబాబు అటు మోడీ నయవంచన చేస్తున్నారంటూ పార్టీ వివరించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ప్రత్యేక హోదా కాంక్షను మేరకు, విభజన హామీల సాధనకోసం వైసీపీ పోరాటం సాగిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఢిల్లీలో, నెల్లూరు లోను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో ప్రత్యేక హోదా అంశం కింది స్థాయి వరకు బలంగా ఉన్నట్లు పార్టీ అధికార ప్రతినిధులు పేర్కొన్నారు.