కలక్షన్స్ కుమ్మేస్తున్న కె.జి.ఎఫ్

-

కన్నడ సినిమాలు తెలుగులో రిలీజైనా ఎప్పుడొచ్చాయో ఎప్పుడు వెళ్లాయో అన్నట్టుగా పరిస్థితి ఉండేది. అయితే రీసెంట్ గా వచ్చిన కె.జి.ఎఫ్ మాత్రం అందుకు భిన్నంగా వసూళ్లు రాబెడుతుంది. కన్నడలో స్టార్ రేంజ్ ఉన్న యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వచ్చిన సినిమా కె.జి.ఎఫ్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా తెలుగులో సాయి కొర్రపాటి నిర్మించారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళి అటెండ్ అవడం వల్ల సినిమాపై క్రేజ్ వచ్చింది.

లాస్ట్ ఫ్రైడే రిలీజైన అన్ని సినిమాల్లో కె.జి.ఎఫ్ మంచి కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఆరోజు రిలీజైన వరుణ్ తేజ్ అంతరిక్షం, శర్వానంద్ పడి పడి లేచె మనసు సినిమా ఆశించినంతగా లేకపోయే సరికి కె.జి.ఎఫ్ కు ప్లస్ అయ్య్యింది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కె.జి.ఎఫ్ తెలుగులో ఇప్పటికే 3.5 కోట్లు కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. ఫుల్ రన్ లో 5 కోట్లు రాబట్టడం గ్యారెంటీ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version