గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల ఇవాళ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో గత జగన్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో 2 శాతం పనులు కూడా పూర్తి చేయలేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు .పోలవరం ప్రాజెక్టు పనులను వైసీపీ ధ్వంసం చేసిందని మండిపడ్డారు.
వైసీపీ ఐదేళ్ల పాలన మొత్తం కక్ష సాధింపు, విధ్వంసమేనని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ మరోసారి అబద్ధాలతో అధికారంలోకి రావాలని చూశారని, కానీ 11 సీట్లతో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఆయన ఎద్దేవా చేశారు. వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.