ఇండియన్ 2లో యువరాజ్ సింగ్ తండ్రి

-

కమలహాసన్, శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఇండియన్ 2 సినిమాలో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజు కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని యోగరాజు స్వయంగా ప్రకటించారు. తనకు మేకప్ వేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపారు యోగరాజు.

కెమెరా వెనుక పని చేసే వారందరికీ ధన్యవాదాలు. నన్ను మరింత స్మార్ట్ గా తయారు చేస్తున్న మేకప్ మ్యాన్ కు స్పెషల్ థాంక్స్. ఇండియన్ 2 సినిమాలో నటించడానికి పంజాబ్ సింహం రెడీగా ఉంది అంటూ యోగరాజ్ పేర్కొన్నారు.

ఇది ఇలా ఉండగా ఇండియన్ 2 సినిమా గతంలో వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. క్రేన్ ప్రమాదం జరగడంతో మధ్యలోనే ఈ సినిమా షూటింగ్ ఆపేశారు శంకర్. అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై.. చకచకా ముందుకు సాగుతోంది. షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్లను వదలనున్నది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Exit mobile version