రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని యోగి ఆదిత్యనాథ్ డిమాండ్

-

రాహుల్ గాంధీ ‘హిందూ’ వ్యాఖ్యలపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. ‘లోక్సభలో ప్రతిపక్ష నేత అయ్యాక రాహుల్ మెచ్యూర్ గా మాట్లాడతారని అనుకున్నాం. కానీ ఆయన వ్యాఖ్యలు అలా లేవు. పూర్తిగా మెచ్యూరిటీ లేని వ్యక్తిగా మాట్లాడుతున్నారు అని ఫైర్ అయ్యారు. హిందూ అనేది మన దేశ ఆత్మ’ అని యోగి ఆదిత్య నాథ్ అన్నారు. హిందువుల మనోభావాలు కించపరిచిన రాహుల్ క్షమాపణ చెప్పాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ డిమాండ్ చేశారు.

కాగా, లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్య వాద తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ‘గొప్ప నేతలంతా అహింస గురించి మాట్లాడారు. కానీ ఇప్పుడు హిందువులని చెప్పుకునేవాళ్లు హింస, ద్వేషం, అబద్ధాలు మాట్లాడుతున్నారు’ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన హోం మంత్రి అమిత్ షా.. హింసను ధర్మంతో జోడించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ భావన తెచ్చిన రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news