‘హత్రాస్ లో రేప్ జరగలేదు’ అని ప్రచారం చేసేందుకు రంగంలోకి ‘పీఆర్’ టీమ్ !

-

ఏదైనా అంశంపై అధికారిక ప్రకటనలు విడుదల చేయాడానికి అన్ని రాష్ట్రాలకు సమాచార విభాగాలు ఉన్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం హత్రాస్‌లో సామూహిక అత్యాచారానికి గురైన 19 ఏళ్ల దళిత యివతి హత్యకు గురై మరణించిందని వివాదాస్పద వాదనను తొక్కి పట్టడానికి ఒక ప్రైవేట్ పిఆర్‌ సంస్థను ఆశ్రయించింది యోగి సర్కార్. సెప్టెంబర్ 29 వాస్తవానికి అత్యాచారం జరగలేదని ఈ పీఆర్ సంస్థ ప్రచారం మొదలుపెట్టింది.

 

గురువారం రాత్రి, భారతదేశంలోని అనేక మంది విదేశీ కరస్పాండెంట్లకి అలానే కొంత మంది జాతీయ మీడియా కరస్పాండెంట్లు – ముంబైకి చెందిన కాన్సెప్ట్ పిఆర్ నుండి క్లారిఫికేషన్ నోట్ అందుకున్నారు. “హత్రాస్ లో అమ్మాయికి అత్యాచారం జరగలేదు. ఫోరెన్సిక్ దర్యాప్తు, ప్రాథమిక వైద్య మరియు పోస్ట్ మార్టం నివేదికలు ఇదే చెబుతున్నాయని వారి నోట్ లో పేర్కొన్నారు. “రాష్ట్రాన్ని కులాల గొడవల్లోకి నెట్టడానికి ఈ కుట్ర జరిగిందని నివేదికలు వెల్లడించాయని నోట్ లో పేర్కొన్నారు” “మొత్తం సంఘటన వెనుక జరిగిన కుట్రని సిట్ బట్ట బయలు చేస్తుందని పేర్కొన్నారు. అయితే నిన్న పొద్దుపోయాక ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు యోగి ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news