“పులితో – మనిషి” రియల్ ఫైట్..రోమాలు నిక్కపోడవాల్సిందే..!!!

-

బోనులో ఉన్న పులిని చూస్తేనే మనకి టెంకెలు లేస్తాయి. గుండెలు వేగంగా కొట్టుకుంటాయి. ఒక వేళ పులి ఆ బోనులోనుంచీ బయటకి వస్తే మనపరిస్థితి ఏమిటి అనే ఆలోచనలు బుర్రలో గిర్రు గిర్రున తిరుగుతూ ఉంటాయి. ఇక పులి ఏకంగా ఎదురుపడి పరుగులు పెట్టిస్తే వామ్మో గుండె ఆగిపోయి చావాల్సిందే. అసలు అలాంటి పరిస్థితి కలలో కూడా రాకూడదని కోరుకుంటారు ఎవరైనా. మరి అలాంటి పులి ఉన్న బోనులోకి ఓ అనుకోకుండా మనిషి వెళ్తే…?? ఆ పులి మీద పడి కండలు ఊడేలా చీల్చుతుంటే ఎలా ఉంటుందో ఓ వ్యక్తి ప్రత్యక్షంగా అనుభవించాడు. అంతేకాదు ఆ పులితో ప్రాణాలకి తెగించి పోరాడి ఎట్టకేలకి బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో నేట్టింట్లో వైరల్ అవుతోంది….వివరాలలోకి వెళ్తే..

సౌదీ అరేబియాలో జరిగిన ఈ సంఘన స్థానికంగా భయాందోళనలు కలిగించింది. సౌదీ లోని రియాద్ లో ఉన్న ఓ జూ పార్క్ కి వెళ్ళాడు మహ్మద్ అబ్దుల్ అనే ఓ వ్యక్తి.అయితే అనుకోకుండా అతడు పై నుంచీ బోనులోకి పడిపోవడంతో ఒక్కసారిగా ఆ పులి అతడిపైకి దూకింది. అందరూ చూస్తుండగానే ఆ సంఘటన జరగడంతో అందరూ అరుపులు కేకలతో ఆ పులి అతడిపై దాడి చేయకుండా నిలువరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే..

ఆ పులి అమాంతం అతడిపై పడి దాడి చేయడం మొదలు పెడుతుంటే, 24 ఏళ్ళ అబ్దుల్ సైతం పులి దాడి నుంచీ తప్పించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఈ లోగా జు సిబ్బంది మత్తుమందు తుపాకీ తో ఆ పులికి మత్తు ఇవ్వగా కొన్ని సెకన్లకే అది స్పృహలోకి వెళ్ళింది. దాంతో సిబ్బంది తీవ్ర గాయాలతో ఉన్న అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి అతడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని తెలుస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news