ఆస్కార్ రేసులో టాప్‌లో నిలిచిన యంగ్ టైగ‌ర్‌..ప్రపంచం చూపు మనపైనే..!

-

ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరి నోటా వినిపిస్తున్న ఒకే ఒక్క మాట ఆర్ఆర్ఆర్. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వేదికలపై కూడా సత్తా చాటుతూ తెలుగోడి పవర్ ఏంటో చూపిస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్ దిగ్గజాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబల్ పురస్కారాల్లో కూడా నాటు నాటు పాటకు గాను ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు దక్కించుకొని అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పింది.

ఇకపోతే గోల్డెన్ గ్లోబ్ అవార్డు మాత్రమే కాదు క్రిటిక్స్ ఛాయిస్ పురస్కారాల్లో కూడా ఈ సినిమా అవార్డును సొంతం చేసుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా త్వరలో మార్చి 12 న యూఎస్ లో అట్టహాసంగా జరగనున్న ఆస్కార్ అవార్డుల్లో కూడా ఆర్ఆర్ఆర్ నామినేషన్స్ దక్కించుకోవడం విశేషం. ఫైనల్ గా జరిగిన ఆస్కార్ షార్ట్ లిస్టులో ఆర్ఆర్ఆర్ స్థానాన్ని దక్కించుకోవడంతో ఆస్కార్ అవార్డుల్లో పోటీపడే అర్హతను దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ కు గాను హీరో ఎన్టీఆర్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తూ ఉండడం గమనార్హం. పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు ఆస్కార్ రేసులో ఎన్టీఆర్ పేరును ప్రముఖంగా ప్రస్తావించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..

ఇందులో ప్రముఖ యూఎస్ టుడే ఆస్కార్ కు పోటీపడుతున్న టాప్ టెన్ నటీనటుల జాబితాను తాజాగా విడుదల చేసింది. అయితే ఇందులో వరల్డ్ ఫేమస్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ సైతం ఎన్టీఆర్ ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలవడం ఇప్పుడు పలు దేశాల వారిని విస్మయానికి గురిచేస్తుంది. అయితే మన దేశం వారు మాత్రం సంబరాలలో మునిగి తేలుతున్నారు. జనవరి 24వ తేదీన ఆస్కార్ ఫైనల్ లిస్ట్ ను ప్రకటించబోతున్నారు. మరి మరో మూడు రోజుల్లో ఏం జరగనుందో తేలిపోతున్న నేపథ్యంలో ఇండియన్ అభిమానులలో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.. మరి ఏం జరగబోతోంది అని తెలియాలంటే మూడు రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version