చైనా కంపెనీ రెడీ చేసిన పబ్ జి యాప్ ను భారతదేశం కొన్ని నెలల క్రితమే బహిష్కరించింది. అయితే టెక్నాలజీని వాడుకుని ఇంకా కొందరు కుర్రకారు ఈ గేమ్ ను ఆడుతూ ఉన్నారు. అలా ఆడుతున్న ఇద్దరు కుర్రాళ్ళ మధ్య మొదలైన గొడవ స్టూడెంట్ గ్యాంగ్ వార్ గా మారింది. ఏకంగా కర్రలు, బ్లేడ్లతో దాడి చేసుకునే దాకా ఈ వ్యవహారం వెళ్ళింది.. కృష్ణాజిల్లా గన్నవరం లో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది.
ఇరు వర్గాలకు చెందిన దాదాపు 30 మంది విద్యార్థులు దాడి చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. వీరందరూ కర్రలు బ్లేడ్లతో పరస్పరం దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దాడి ఘటనలో పాల్గొన్న దాదాపు 15 మందిని ఇంటర్ విద్యార్థులుగా గుర్తించారు. ప్రస్తుతం గన్నవరం పోలీసుల దాదాపు ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్టూడెంట్ గ్యాంగ్ వార్ దాదాజీ గూడెం హై స్కూల్ గ్రౌండ్ లో జరిగినట్లు తెలుస్తోంది.