ప్రణయ్ పరువు హత్య తెలంగాణలోనే కాదు యావత్తు భారతదేశమంతా సంచలనం సృష్టించింది. ప్రణయ్ హత్య తర్వాత సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపించాయి. ప్రణయ్ భార్య అమృతది తప్పు అని కొందరు.. లేదు అమృత తండ్రి మారుతీరావుది తప్పని మరికొందరు… సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
అయితే.. ఓ యువకుడు అమృతను కించపరిచేలా ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టాడట. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ యువకుడి పేరు ఈశ్వర్ అని.. వయసు 25 ఏళ్లు అని సమాచారం. ఈశ్వర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని విచారిస్తున్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రణయ్ – అమృత వ్యవహారంలో ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఎన్నో రకాల కామెంట్లు వచ్చినప్పటికీ.. అభ్యంతర కామెంట్లు చేసే వారిని అరెస్ట్ చేయడం మాత్రం ఇదే మొదటిసారి. సోషల్ మీడియాలో ఏది పడితే అది కామెంట్ చేసేవాళ్లకు ఇది ఒక వార్నింగ్ గా భావించవచ్చన్నమాట.