భారత్ లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ యూ ట్యూబ్ ( Youtube ) తప్పకుండా చూసే ఉంటారు. అంతలా యూ ట్యూబ్ ప్రాచూర్యం పొందింది. ఇక భారత ప్రభుత్వం చైనాతో వివాదాల కారణంగా చైనా కంపెనీ అని టిక్ టాక్ ను నిషేధించిన తర్వాత యూ ట్యూబ్ చూసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అందుకు తగ్గట్లుగా యూ ట్యూబ్ కూడా షార్ట్ వీడియోలను ప్రవేశపెట్టింది. కాగా టిక్ టాక్ లేకపోవడంతో ఈ వీడియోలను జనాలు విపరీతంగా చూస్తున్నారు. దీంతో యూ ట్యూబ్ మరింత మంది షార్ట్ వీడియోలు చేసే వారిని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు అడుగులేస్తుంది. అందుకు తగ్గట్టుగా వారి కోసం ప్రస్తుతం స్పెషల్ ఫండ్ ను కేటాయించింది.
కాగా యూ ట్యూబ్ ఇలాంటి షార్ట్ వీడియోల కోసం దిమ్మతిరిగి పోయే రేంజ్ లో నిధిని ఏర్పాటు చేసింది. దాదాపు 100 మిలియన్ డాలర్లతో ఈ నిధి ఏర్పాటైంది. కాగా 2021 నుంచి 2022 మధ్య వైరలైన షార్ట్ వీడియోల క్రియేటర్లకు ఇందులో నుంచి ప్రోత్సాహకాలు అందిచనుంది. ఇలా అందించే రివార్డులకు యూ ట్యూబ్ ఓ మెలిక పెట్టింది. షార్ట్ వీడియోలకు వచ్చిన వ్యూస్ ను ఆధారంగా చేసుకుని రివార్డులను అందిస్తామని వెల్లడించింది.
ఈ నిధిని యూ ట్యూబ్ భారత్ లో మాత్రమే కాకుండా వివిధ దేశాలలో అందిచనుంది. ఇలా అందిచడం వలన మరింత మంది షార్ట్ వీడియో క్రియేటర్లు ఆకర్షితులవుతారని కంపెనీ భావిస్తోంది. అంతే కాకుండా యూ ట్యూబ్ లో సూపర్ థ్యాంక్స్ అనే కొత్త ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సాయంతో క్రియేటర్లు మరింతగా డబ్బును సంపాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.