కొండ చిలువలకు విషం ఉండదు. అందువల్ల వాటి కాటు ప్రమాదం కాదు. కానీ అవి చాలా భారీ సైజులో ఉంటాయి. అలాగే మనల్ని చుట్టుకుని నలిపి చంపేయగలవు. అందువల్ల వాటిని చూస్తే ఎవరికైనా భయమే కలుగుతుంది. అయితే కొందరికి మాత్రం పాములు అంటే సరదా. వాటితో వారు నిత్యం ఆడుకుంటుంటారు. ఇక ఆ వ్యక్తి కూడా పాములతో రోజూ సరదాగా గడుపుతుంటాడు. ఈ క్రమంలోనే అతను నిర్వహిస్తున్న ఓ జూలో ఉన్న భిన్నమైన కొండ చిలువ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న రెప్టైల్ జూలో ఓ వెరైటీ కొండ చిలువ ఉంది. అది ఇంద్ర ధనుస్సు రంగులో ఉంది. ఆ జూకు చెందిన ఫౌండర్ జే బ్రూవర్ దాన్ని ఆడిస్తున్నాడు. కాగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
View this post on Instagram
నిజానికి ఆ వీడియోను ఈ ఏడాది మేలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడది మరోసారి వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఆ వీడియోకు 20 మిలియన్లకు పైగా వ్యూస్, 10 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఆ కొండ చిలువను చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.