గూగుల్, యూట్యూబ్ లకు రష్యా వార్నింగ్.. తీవ్రపరిణామాలు తప్పవంటూ హెచ్చరిక

-

ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాపై అనేక ఆంక్షలు విధిస్తున్నాయి అమెరికా, బ్రిటన్, కెనడాలతో పాటు యూరోపియన్ యూనియన్ లోని పలు దేశాలు. దీంతో ఆర్థిక పరంగా రష్యా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేలా… పాశ్చాత్య దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఉక్రెయిన్ పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యా నుంచి పలు కంపెనీలు వెళ్లిపోతున్నాయి. మరికొన్ని ఆ దేశంలో తన సేవలను నిలిపివేస్తున్నాయి. ఇటీవల ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్, యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్, పూమా, మెక్ డొనాల్డ్ వంటి కంపెనీలు రష్యాలో తమ ఉత్పత్తులు, సేవలను నిలిపివేశాయి. 

ఇదిలా ఉంటే తాజాగా రష్యా యూట్యూబ్, గూగుల్ లను ఘాటుగా హెచ్చరించింది. గూగుల్, యూట్యూబ్ తమ దేశానికి వ్యతిరేఖంగా కంటెంట్ ప్రసారం చేస్తున్నాయంటూ.. రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వాటిని వెంటనే ఆపేయాలని హెచ్చరించింది. యూట్యూబ్ చర్యలు తీవ్రవాద స్వభావాన్ని కలిగి ఉన్నాయని… అవి రష్యా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ విమర్శించింది.

Read more RELATED
Recommended to you

Latest news