వెన్నపూసతో కిడ్నీలో రాళ్ళు తీస్తారా…? నమ్మరా ఎంట్రా బాబూ…? నిజం…!

-

కిడ్నీలో రాళ్ళు పోవాలి అంటే చాలా మంది చేయని ప్రయత్నం లేదు. ఎన్నో విధాలుగా కిడ్నీ లో రాళ్ళు పోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినా సరే అవి పోయే అవకాశాలు చాలా తక్కువ. నీళ్ళు తాగడంతో పాటుగా ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అయినా సరే పెద్దగా ఫలితం ఉండే అవకాశం చాలా తక్కువ. అధునాతన వైద్యం ఉంటేనే అవి పోయే అవకాశం ఉంటుంది అనేది అందరికి తెలిసిన విషయమే.

కాని చిత్తూరు జిల్లాలో మాత్రం అనూహ్యంగా కొందరు వెన్నపూస తో కిడ్నీ లో రాళ్ళు తొలగిస్తామని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. అవును ఇది పచ్చి నిజం. చిత్తూరులోని గంగాధర నెల్లూరు మండలం కొండేపల్లి పంచాయతీ పోలినాయుడు పల్లె గ్రామంలో జగన్నాథనాయుడు, విజయమ్మ దంపతులు ఏమీ చదువుకోలేదు. పొట్ట కూటి కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి, లాభం లేదనుకుని కాస్త సరికొత్తగా ఆలోచించారు.

ఇందుకోసం వైద్యులు గా మారిపోయి వెన్నపూస్తే చాలూ మూత్రపిండాల్లో ఉన్న రాళ్లు కరిగిపోతాయి అని నమ్మించారు. జనం కూడా బాగానే నమ్మారు. కిడ్నీల్లో రాళ్లు తొలగిస్తామంటూ కొన్నాళ్లుగా నాటు వైద్యం చేస్తున్నారు. పోరుగున ఉన్న రాష్ట్రాలు తమిళనాడు, కర్నాటక నుంచి కూడా రోగులు ఇక్కడకు రావడం గమనార్హం. కొందరు అధికారులకు ఫిర్యాదు చేయడంతో వీరి గుట్టు రట్టు అయింది.

సమాచారం అందుకున్న డీఎంహెచ్‌వో రమాదేవి కిడ్నీ బాధితురాలిగా నటించి నాటువైద్యుల వద్దకు వెళ్లగా… రూ.500 ఫీజు కడితే వైద్యం చేస్తామని అనడంతో తాను వైద్యాధికారిణని చెప్పారు రమాదేవి. దీనితో వాళ్ళ ఇంట్లో స్కానింగ్ రిపోర్ట్ లు, టోకెన్ స్లిప్ లు, వెన్నపూస స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసారు. ఇలా దాదాపు లక్షలు లక్షలు ఈ దంపతులు సంపాదించారని అధికారులు గుర్తించారు. వస్తున్న ఫిర్యాదులను నమోదు చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news