ఆరు రోజులుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధర ఈ రోజు పతనమైంది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం కొద్దిగా తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.30 క్షీణించింది. దీంతో పసిడి ధర రూ.41,000 నుంచి రూ.40,970కు దిగొచ్చింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే కొనసాగింది. దీంతో ధర రూ.44,700 వద్దనే నిలకడగా ఉంది. ఇకపోతే బంగారం ధర ఆరు రోజులుగా పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ కాలంలో బంగారం ధర ఏకంగా రూ.2 వేలకు పైగా పరుగులు పెట్టింది.
బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర భారీగా పతనమైంది. ఏకంగా రూ.1500 పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ.51,500 నుంచి రూ.50,000కు దిగొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.30 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.40,970కు క్షీణించింది. వెండి ధర రూ.50,000కు దిగొచ్చింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో మాత్రం వెండి, పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి.