వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు మరియు మధ్యతరగతి ప్రజలు జగన్ పరిపాలన పై చాలా సంతోషంగా ఉన్నారని ఇటీవల చాలా సర్వేలలో తేలింది. అయితే జగన్ తీసుకున్న నిర్ణయాలకు సానుకూలమైన స్పందన ఏ విధంగా వస్తుందో వ్యతిరేకించే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో కనబడుతోంది. అమరావతి మరియు ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం విషయంలో జగన్ నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించడం జరిగింది.
ముఖ్యంగా మీడియా ముందు ప్రకటించేసి తర్వాత వాటిని రద్దు చేసి అనేక విమర్శలు ఎదుర్కొన్న జగన్ ని సోషల్ మీడియాలో చాలా మంది యాంటీ ఫ్యాన్స్ తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా తీసుకున్న ఓ నిర్ణయానికి సోషల్ మీడియాలో ఉన్న యాంటీ ఫ్యాన్స్ జై కొడుతున్నారు. అదేమిటంటే పంచాయతీరాజ్ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు మద్యం మరియు డబ్బు వంటి వాటిని చూపెట్టి ప్రజలను ప్రభావితం చేసే విధంగా వెళ్తే కఠినంగా శిక్షించడానికి జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పంచాయతీరాజ్ ఎన్నికల్లో పాల్గొనే పోటీ చేసే అభ్యర్థులు దగ్గర డబ్బు మరియు మద్యం పట్టుబడితే వారికి మూడేళ్లు జైలు శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధించాలని జగన్ సర్కార్ కొత్తగా పంచాయతీరాజ్ చట్టం లో ఆర్డినెన్స్ తేవడం జరిగింది. దీంతో ఈ వార్త బయటకు రావడంతో జగన్ యాంటీ ఫ్యాన్స్…సూపర్ నిర్ణయం తీసుకున్నారు మీరు… ఇది మీ ఎనిమిది నెలల్లో పరిపాలనలో ఫస్ట్ క్లాస్ సరైన డెసిషన్ అని కామెంట్ చేస్తున్నారు.