ఆ పాయింట్ మీద లాక్ డౌన్ ఎత్తేదాం అని జగన్ ప్లాన్ .. తేడా వస్తే చరిత్రలో మచ్చ గ్యారెంటీ !

-

కరోనా వైరస్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థకి చాలా గట్టి దెబ్బ పడింది. 21 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం జరిగింది. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పగడ్బందీగా లాక్ డౌన్ నీ అమలు చేశాయి. దీంతో చాలా వరకు రాష్ట్రాల ఖజానాలు ఖాళీ అయిపోయాయి. ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ మీద పూర్తిగా దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని గుర్తించింది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించే విషయంలో పూర్తిగా నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేయాలని ఆలోచన చేస్తుంది. దేశవ్యాప్తంగా ఒకే వ్యూహాన్ని అమలు చేయడం కంటే ఆయా రాష్ట్రాల్లో వైరస్ తీవ్రతను బట్టి అక్కడి ప్రభుత్వాలకి నిర్ణయాధికారాన్ని వదిలి వేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.ఈ నేపథ్యంలో తెలంగాణ, పంజాబ్ మరియు మహారాష్ట్రలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ మూడు రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మాత్రం లాక్ డౌన్ ను ఎత్తివేయాలని జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోడీ కి సూచించడం  మనకందరికీ తెలిసినదే. రాష్ట్రంలో మొత్తం 676 మండలాల్లో కేవలం 37 మండలాలే రెడ్ జోన్ లు, 44 మండలాలు ఆరెంజ్ జోన్ లో ఉన్నాయి. మిగతా 595 మండలాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి. కనుక జగన్ లాక్ డౌన్ ఎత్తివేయాలని మోడీ నీ కోరడం జరిగింది. అంతేకాకుండా ఇదే సమయంలో పరిశ్రమల గురించి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి మోడీ కి జగన్ వివరిస్తూ ఆర్థికవ్యవస్థ మెల్లగా అయిన నడవాలని సూచించడం జరిగింది. లాక్ డౌన్ ఎత్తివేయక పోతే వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింటుందని తెలిపారు. పరిశ్రమలు ఇప్పటికే దెబ్బతిన్నాయని ఇంకా రాష్ట్రానికి ఆదాయం అంటూ ఏమీ ఉండదు అంటూ ప్రధాని మోడీ కి వివరించారు.

 

మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా 81 ప్రాంతాలలో వైరస్ ప్రభావం ఉందని, మిగతా 595 చోట్ల వైరస్ ప్రభావం ఏమీ లేదని మోడీకి జగన్ వివరించారు. జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనే పాయింట్ బట్టి వైరస్ ఉన్న చోట లాక్ డౌన్ కొనసాగించాలని…మిగతా చోట్ల ఎత్తివేయమని జగన్ తన ప్లాన్ ప్రధానికి వివరించారు. కాగా రాష్ట్రంలో ఉన్న ప్రజలు మాత్రం పూర్తిగా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు.

 

పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బులు పోయినా పర్వాలేదు మనిషి ఉండాలని చాలా బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నారు. కానీ జగన్ మాత్రం ఇటువంటి ప్రమాదకరమైన వైరస్ విషయంలో రాష్ట్ర ప్రజల ప్రాణాలు ఏం పట్టనట్టు వ్యాఖ్యానించడం దారుణమని అంటున్నారు. ఇప్పటి వరకు ఓపిక పట్టిన జగన్ ఏప్రిల్ 30 వరకు ఓపిక పడితే ఏమవుతుంది అని అందరూ అంటున్నారు. ఒకవేళ లాక్ డౌన్ రాష్ట్రంలో తీసేస్తే మళ్లీ వైరస్ ప్రబలి…ఏ మాత్రం ప్రాణాలు పోయిన మేం నష్టపోతాం అంటూ రాష్ట్ర ప్రజానీకం  అంటుంది. అప్పుడు జగన్ చరిత్రలో పెద్ద తప్పు చేసిన వారవుతారని, జగన్ రాజకీయ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతుందని చాలామంది అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version