గతకొన్ని రోజులుగా ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనేతలకు.. మాంచి ఆయుధంలా దొరికారు జగన్ అన్నవార్తలొస్తున సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మైకందుకున్న కర్ణాటక కాంగ్రెస్ సీనియార్ నేత సిద్ధరామయ్య… సీఎం యాడ్యురప్పపై ఫైరవ్వడానికి, కరోనా సమయంలో విమర్శలు గుప్పించడానికి ఎంచుకున్న అస్త్రం జగన్! జగన్ ని చూసి, ఆయన సమర్ధవంతమైన పాలన చూసి, కరోనా కష్టకాలంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను చూసి యాడ్యురప్ప నేర్చుకోవాలై సూచించారు! వాటిని కర్నాటక సర్కార్ సీరియస్ గా తీసుకుంది!!
సిద్ధరామయ్య సూచనలను యాడ్యురప్ప ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లుంది అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకూ ఆ సీరియస్ గా తీసుకున్న విషయం ఏమిటంటే… ఏపీలో కరోనా నుండి కోలుకున్న జనాలకు తక్షణ సాయం కింద మూడు వేల రూపాయలు అందిస్తుంది జగన్ ప్రభుత్వం. ఆ సంగతి తెలిసిందే. అదే ఆదర్శమో లేక సిద్దరామయ్య సూచనల ప్రభావమో తెలియదు కానీ… కర్ణాటక ప్రభుత్వం కూడా కరోనా నుండి కోలుకున్న జనాలకు ఐదువేల బహుమతిని అందించనుంది.
కాకపోతే ఇక్కడ తేడా అంటే… జగన్ చేసేది “సాయం” కాబట్టి.. ప్రతిగా ప్రజల హృదయాల్లో ప్రేమకు కోరుకుంటున్నారు! కర్నాటక ప్రభుత్వం ఇచ్చేది “బహుమతి” కాబట్టి… ప్రతిగా ప్లాస్మాను కోరుకుంటున్నారు. అవును… కర్ణాటకలో కరోనా నుండి కోలుకున్న జనాలు తమ ప్లాస్మా కనుక డొనేట్ చేయడానికి అంగీకరిస్తే వారికి ప్రోత్సాహకంగా ఐదువేల రూపాయల నగదు “బహుమతి”ని ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం!