పార్టీ పవర్ లో లేనప్పుడు క్యాడర్ ను కాపాడుకోవాలి.. వారి కష్టాలను తెలుసుకోవాలని.. అండగా నిలవాలి.. అవసరమైతే.. పోరాటాలకు సిద్దపడాలి..అప్పుడే క్యాడర్ లో పార్టీమీద, నాయకుని మీద నమ్మకం ఏర్పడుతుంది.. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు వైసీపీ అధినేత జగన్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పవర్ లో కంటే ప్రతిపక్షంలోనే ఎక్కువ ఏళ్లు ఉన్నది.. 2019లో అధికారంలోకి వచ్చింది.. 2024లో మళ్లీ ప్రతిపక్షానికి పరిమితమైంది..
వైసీపీ అధినేత జగన్ను ఎదుర్కొనేందుకు గత ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసొచ్చాయి.. దీంతో వైసీపీ 11 స్థానాలకే పరిమితమయ్యాయి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు అధికమయ్యాయని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ దగ్గర నుంచి నందిగం సురేష్ దాకా కీలక నేతల్ని ఏదో కేసులో జైలుకు వెళ్లారు.. మరోపక్క గ్రామస్థాయిలో ఉండే కార్యకర్తలపై దాడులు కూడా అధికమయ్యాయి..
ఓ వైపు కార్యకర్తలపై దాడులు.. మరోవైపు సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూవైసీపీ నేతలు మండిపడుతున్నారు.. ఈ క్రమంలో క్యాడర్ లో భరోసా నింపేందుకు వైసీపీ అధినేత జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు.. రాష్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు వందల మంది సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్టైన నేపధ్యంలో వారికి అండగా ఉండాలని డిసైడయ్యారు..అందుకోసం ఇప్పటికే లీగల్ సెల్ నుంచి ఏర్పాటు చేసిన ఆయన.. రీసెంట్ గా సోషల్ మీడియా కార్యకర్తల రక్షణ కోసం ప్రత్యేక టాస్క్ పోర్స్ ను ఏర్పాటు చేశారు..అరెస్టులతో అలజడికి గురవుతున్న కార్యకర్తలకు రక్షణగా ఉండేందుకు , సమర్దవంతంగా ఎందుర్కొనేందుకు దీన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి..
ఈ టాస్క్ పోర్స్ బృందం జిల్లాలోని ముఖ్యనేతల్ని, లీగల్ సెల్ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటుంది.. సోషల్ మీడియా కార్యకర్తలకు ఏమైనా ఇబ్బంది జరిగితే.. వెంటనే లీగల్ సెల్ ప్రతినిధులు, టాస్క్ పోర్స్ అలర్ట్ అవ్వడం, వారికి అండగా నిలవడం వంటి కార్యక్రమాలు చేస్తుందని వైసీపీకికి చెందిన ప్రతినిధులు చెబుతున్నారు.. మొత్తంగా క్యాడర్ ను కాపాడుకునేందుకు వైసీపీ అధినేత జగన్ మరో అడుగు ముందుకేశారు..