ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు అవుతుండటం అత్యంత సహజం… పైగా రాజకీయాల్లో మరీ సహజం! నిన్నమొన్నటివరకూ ఎర్ర బుగ్గ కారులో తిరిగిన వారే.. ప్రజలు కనికరించకపోయేసరికి మరుసటి రొజే కారులో పిలిచి మరీ పలకరించుకుంటూ వెళ్తాడు. నిన్నటి వరకూ పోలీసులతో సెల్యూట్ లు కొట్టించుకున్నవారే ఒక్క రోజులో అదే పోలీసులతో సంకెళ్లు వేయించుకుంటారు!! ఇది గతం.. వర్తమానం.. భవిష్యత్తు? ఇంతకూ ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే… ప్రస్తుతం తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ తాజా పరిస్థితి గురించి. ఒకప్పుడు రాయలసీమ కింగ్స్ గా.. తాడిపత్రి ని కంచుకోటగా నిర్మించుకుని అనంతను ఏలుతున్న ప్రభువులుగా సాగిన వీరి వైభవం.. నేడు అదే అనంతలో, అదే తాడిపత్రిలో ప్రశ్నార్థకంగా మారిందని వినిపిస్తున్న కామెంట్లే దీనికి కారణం!!
అధికారంలో ఉన్నప్పుడు కన్నూ మిన్ను కానకుండా అక్రమాలు, దౌర్జన్యాలు చేయడంతోపాటు… “నోరు అదుపు – మాట పొదుపు” అన్న సూత్రం పాటించని పక్షంలో ఇలాంటి ఇబ్బందులు తప్పవు అన్నట్లుగా జేసీ ఫ్యామిలీ పరిస్థితి ఉందని పలువురు అభిప్రాయపడుతున్న ఈ క్రమంలో… తాడిపత్రి కేంద్రంగా వారికి మరో ఎదురుదెబ్బ తగలనుందని తెలుస్తోంది! ముప్పైఏళ్లుగా అవిరామంగా సాగిన రాజకీయ వైభవం ఒక్కసారిగా కూలిపోబోతుందంట! దీనికి స్థానిక ఎన్నికలను అస్త్రాలుగా చేసుకోబోతోందట అధికారపక్షం!
అవును.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన స్థానాల్లో వైసీపీ జెండా ఎగురుతుందని జిల్లాలో వినిపిస్తోన్న పొలిటికల్ డిస్కషన్స్ దృష్ట్యా… తాడిపత్రి మున్సిపాలిటీని వైసీపీ తన ఖాతాలో వేసుకోవాలని పావులు కదుపుతుందని తెలుస్తోంది! ఎంపీగా ఓడిపోవడంతో జిల్లా స్థాయిలో, ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో నియోజకవర్గ స్థాయిలో ఇప్పటికే రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న జేసీ బ్రదర్స్ కి ఇక మున్సిపాలిటీ స్థాయిలో కూడా రాజకీయంగా ఇబ్బందులు తేవాలని వైకాపా స్కెచ్ వేస్తుందంట. దీంతో తాడిపత్రి కేంద్రంగా జగన్.. జేసీ ఫ్యామిలీఇకి మరో గట్టి దెబ్బ కొట్టినట్లే నని కామెంట్లు వినిపిస్తున్నాయి!! ఇదే జరిగితే…. “తాడిపత్రి లో జేసీ ఫ్యామిలీ వైభవం.. ఒక గతం”గా మిగలబోతోందని ప్రచారం జరుగుతుంది!
కగా… జేసీ ట్రావెల్స్ అక్రమాల కేసులో అరెస్టయి కడప జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిల బెయిల్ పిటిషన్‌ను అనంతపురం కోర్టు తిరస్కరించి.. ఇద్దరిని రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే!