బ్రేకింగ్‌ : జ‌గ‌న్ మరో సంచలన నిర్ణయం

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మద్యం కొనుగోలుపై మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మద్య నియంత్రణలో భాగంగా పలు చర్యలు చేపట్టిన ప్రభుత్వం మరో కొత్త నిబంధనను తీసుకువచ్చింది. మద్యాన్ని సేవించాలనుకునే వారికి కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. అదేంటి మ‌ద్యం సేవించ‌డానికి కార్డా అని అనుకుంటున్నారా.. అవును మీరు విన్న‌ది నిజ‌మే. ఇక నుండి ఎవరైనా మద్యం కోనుగోలు చేయాలంటే లిక్కర్ పర్చైజ్ కార్డ్ కొనుక్కోవాలట. ఆ కార్డ్ పొందాలంటే ముందుగా 5000/- లు చెల్లించాల్సి ఉంటుందట.

అంతే కాదు మన మొబైల్ ఫోన్ నెట్ వర్క్ కి ఎలా రీఛార్జ్ చేసుకుంటామో అలానే సంవత్సరం గడవగానే 5000/- పెట్టి రీఛార్జ్ చేసుకోవాలట. అది కూడా అందరికి ఈ కార్డు ఇచ్చేది లేదు. 25 సంవత్సరాలు వయసు దాటి ఉన్నవారు మాత్రమే ఈ కార్డు కు అర్హులని, వారు కూడా గుర్తింపు పొందిన హాస్పిటల్ డాక్టర్ దగ్గర నుంచి ఎటువంటి జబ్బులు లేవని మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే అప్పుడు కార్డు ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నాడట. దీని ద్వార మైనర్లకు మద్యం లభించకపోవడంతో పాటు రాష్ట్రానికి కూడ ముందస్తుగా ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయి. మ‌రి మద్యం నియంత్రించాలనే ఆలోచనలో భాగంగా జగన్ ప్రవేశపెడుతున్న ఈ కొత్త ప్లాన్ ఏమేరకు అమలవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news