ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను… అయితే జగన్ మోహన్ రెడ్డి అని పూర్తి పేరుతో పిలవకుండా.. వైఎస్ జగన్ అని ఆయన్ను ఇష్టపడేవారు ఇష్టపడేపేరుగా జగన్ అని కానీ పిలవకుండా.. కేవలం ఆయన కులాన్ని మాత్రమే ప్రస్థావించేలా. “జగన్ రెడ్డి” అని పిలిస్తుంటారు టీడీపీ నేతలు! వారికున్న కుల గజ్జి అందరికీ ఉందని చెప్పేలా కొందరు నేతలు అలా జగన్ ను ఒక కులానికి పరిమితం చేసేలా రాజకీయాలు చేస్తుంటారు! అయితే… తనకు కులం మతం ఉండవని చేతలతో చూపించారు జగన్!
అవును… భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోవడానికి ప్రధానమైన కారణాలు “కులం – మతం” అనేది తెలిసిన విషయమే! ఈ జాడ్జ్యం పోయేవరకూ దేశం బాగుపడదు అనేది అంతా చెప్పేమాట. కానీ.. పాటించేవిషయంలో ఎవరికీ ఆ సోయ ఉండదు! అయితే తనను రెడ్డి అయిన్ క్రీస్టియన్ అని పరిమితమైన మాటలు మాట్లాడేవారికి చెంపపెట్టులా, రేపటి జనరేషన్ లో ఇలాంటి వ్యాదులు ఉండకుండా చూసేలా జగన్ ఒక నిర్ణయం తీసుకున్నారు!
పాఠశాలల్లో ప్రవేశానికి కులం, మతం వివరాలు ఇవ్వనవసరం లేదు అని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే తరాలకు ఆ జబ్బు లక్షణాలు కొంతైనా తగ్గించాలనే తాపత్రయంలో భాగంగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు!
ఇదే విధంగా “నేటి బాలలే రేపటి పౌరులు” అని “చిల్డ్రన్స్ డే” రోజు మాత్రమే మాటల్లో చెప్పే నాయకులకు తనకూ చాలా తేడా ఉందని చెబుతూ… మెజారిటీ శ్రద్ధ.. పిల్లలు, స్కూళ్లు, వారి చదువులు, వారి పుస్తకాలు, హోం వర్క్ లు… ఇలాంటి విషయాలపై పెడుతున్నారు జగన్! ఇలా ఆలోచించే కుటుంబ పెద్దలే తగ్గిపోతున్న ఈ రోజుల్లో… ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా ప్రతీ కుటుంబంలోని ఒక సభ్యుడిగా ఆలోచించడం నిజంగా అభినందనీయమే కదా!!