షాకింగ్.. వైఎస్ జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి కన్నుమూత

ఏపీలో ఎన్నికల వేళ వైఎస్ జగన్ ఇంట్లో విషాదం నెలకొన్నది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, వైఎస్ జగన్ బాబాయ్.. వైఎస్ వివేకానందరెడ్డి కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన మృతి చెందారు. ఆయన వయసు 68 ఏళ్లు. పులివెందులలో ఆయన తుది శ్వాస విడిచినట్టు వైసీపీ వర్గాలు వెల్లడించాయి.

వివేకానంద రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన 1950 ఆగస్టు 8 న పులివెందులలో జన్మించారు. 1989, 1994లో పులివెందుల నుంచి వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999, 2004 లో కడప ఎంపీగా గెలుపొందారు. అనంతరం 2009లో ఎమ్మెల్సీగా ఎన్నియ్యారు. వ్యవసాయ మంత్రిగా పనిచేశారు.