బయట కొన్ని షాపుల్లో ఏవైనా వస్తువులను కొని క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరిపితే వాటికి అయ్యే చార్జిలను కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నారు. నిజానికి అలా చేయరాదు. సదరు మర్చంట్లే ఆ చార్జిలను బ్యాంకులకు చెల్లించాలి.
బుక్ మై షో లేదా ఇతర ఏ మూవీ టిక్కెట్ బుకింగ్ వెబ్‌సైట్‌లోనైనా టిక్కెట్లు బుక్ చేస్తున్నారా ? జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్‌లలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా..? ఓలా, ఊబర్.. తదితర యాప్‌లలో క్యాబ్ బుక్ చేస్తున్నారా..? అయితే మీ అందరికీ ఇప్పుడు చెప్పబోయే విషయం వర్తిస్తుంది. ఏమీ లేదండీ.. ఆయా సేవలను ఉపయోగించుకుంటున్నప్పుడు మీకు మీరు చెల్లించబోయే మొత్తం, జీఎస్‌టీ కాకుండా.. ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీ అనే మరో ఆప్షన్ కనిపిస్తూ దానికి ఎదురుగా మీరు మరికొంత మొత్తం చెల్లించాలని బిల్లులో వస్తుంది కదా..
అవును, కరెక్టే.. బుక్ మై షోలో అయితే టిక్కెట్ బుక్ చేసి అమౌంట్ పే చేసేటప్పుడు అందులో ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీజు అయితే వేస్తారు.. కరెక్టే కదా.. అంటారా.. అయితే ఆ ఫీజును నిజానికి వసూలు చేయకూడదట.. అది చట్ట విరుద్ధమట. అవును, మీరు విన్నది నిజమే. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
హైదరాబాద్‌కు చెందిన విజయ్ గోపాల్ అనే ఆర్‌టీఐ (సమాచార హక్కు) కార్యకర్త ఇటీవలే ఆర్‌బీఐకి ఆర్‌టీఐ ద్వారా ఓ దరఖాస్తు పెట్టుకున్నాడు. బుక్ మై షో వంటి సైట్లు, యాప్‌లలో ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీజు విధిస్తున్నారు కదా.. అలా ఎవరైనా వసూలు చేయవచ్చా..? అని సమాధానం కోరాడు. దీనికి ఆర్‌బీఐ ఆర్‌టీఐ యాక్టు ప్రకారం జవాబు ఇచ్చింది. తాము అలాంటి నిబంధన ఏదీ పెట్టలేదని, ఏ వెబ్‌సైట్ లేదా యాప్ అయినా సరే.. కస్టమర్ల నుంచి ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీజు వసూలు చేయరాదని ఆర్‌బీఐ తెలిపింది. ఆయా మర్చంట్లు కేవలం బ్యాంకులకు మాత్రమే Merchant Discount Rate (MDR) నియమ నిబంధనల ప్రకారం కస్టమర్లు చేసిన క్రెడిట్, డెబిట్, ఇంటర్నెట్ లావాదేవీలకు అనుగుణంగా బ్యాంకులకు ఫీజు చెల్లించాలని, కానీ మర్చంట్లు అదే ఫీజును మాత్రం కస్టమర్ల నుంచి వసూలు చేయరాదని ఆర్‌బీఐ తెలిపింది. అంటే.. బుక్‌మైషో కావచ్చు, మరే ఇతర సైట్ లేదా యాప్ కావచ్చు… అందులో కస్టమర్లు చేసే ట్రాన్సాక్షన్లకు ఫీజు వసూలు చేయరాదు. మొత్తం సొమ్ము, జీఎస్టీ మాత్రమే తీసుకోవాలి. కానీ బుక్ మై షో మాత్రం ఎప్పటి నుంచో ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీజు వసూలు చేస్తోంది. నిజానికి ఇది ఆర్‌బీఐ చెప్పిన ఎండీఆర్ నిబంధనలకు వ్యతిరేకం. అంటే.. చట్టవిరుద్ధమన్నమాట..
అయితే బుక్ మై షో, పీవీఆర్ లాంటి సంస్థలు తమ సైట్లు, యాప్‌లలో టిక్కెట్లు బుక్ చేసుకుంటే చట్ట విరుద్ధంగా ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీజును వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తూ సదరు విజయ్ గోపాల్ ఆ సంస్థలపై వినియోగదారుల ఫోరంలో కేసు పెట్టాడు. ఈ క్రమంలో ఆ కేసును ఈ నెల 23వ తేదీన ఫోరం విచారించనుంది. అయితే కేవలం ఈ రెండు సైట్లు మాత్రమే కాదు, నిజానికి అనేక సైట్లు, యాప్‌లలో ఇలాంటి ఫీజును వసూలు చేస్తున్నారు. బయట కొన్ని షాపుల్లో ఏవైనా వస్తువులను కొని క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరిపితే వాటికి అయ్యే చార్జిలను కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నారు. నిజానికి అలా చేయరాదు. సదరు మర్చంట్లే ఆ చార్జిలను బ్యాంకులకు చెల్లించాలి. కానీ వారు ఆ చార్జిలను కస్టమర్ల నుంచి వసూలు చేసి బ్యాంకులకు చెల్లిస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ మనకు ఆ విషయం తెలియక ఇప్పటికి ఎన్నో రూపాయలను అనవసరంగా నష్టపోయాం. కనుక ఇకనైనా మేల్కొనండి.. క్రెడిట్, డెబిట్ కార్డులు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు చేస్తే మనం ఎలాంటి చార్జిలను మర్చంట్లకు చెల్లించాల్సిన పనిలేదు. వారే బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుందని చెప్పండి. ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా షేర్ చేయండి.
Source: Know Your Rights – BookMyShow’s Internet Handling Fee Illegal: RTI