అల్లూరిగా చరణ్.. మహేష్ కు మైండ్ బ్లాంక్..!

6

రాజమౌళి తీసే ప్రతి సినిమా ఓ సెన్సేషనే.. బాహుబలి ముందు వరకు తెలుగు సినిమాలతో సౌత్ వరకే ఆయన ప్రతిభ తెలిసేది. కాని ఎప్పుడైతే బాహుబలి వచ్చిందో ప్రపంచవ్యాప్తంగా ఆయన టాలెంట్ విస్తరించింది. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమాపై అందరు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో ఓ రియల్ హీరోస్ స్టోరీతో వస్తున్నాడని తెలుస్తుంది.

అనుకున్నట్టుగానే ఆర్.ఆర్.ఆర్ అనౌన్స్ మెంట్ తో అంచనాలు పెంచిన జక్కన్న గురువారం జరిగిన ప్రెస్ మీట్ లో సినిమా కథ ఇలా ఉంటుంది అని చెప్పి మరింత అంచనాలు పెంచేశాడు. అయితే కొమరం భీమ్ గా తారక్ ఓకే కాని అల్లూరి సీతారామరాజుగా చరణ్ ను ఎందుకు సెలెక్ట్ చేశాడు. ఆ స్థానంలో మహేష్ ను తీసుకోవచ్చు కదా అని అన్నారు మీడియా వాళ్లు. ఆల్రెడీ సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజుగా మెప్పించారు. అయితే ఓ షోలో మహేష్ తో తాను ఎలాంటి సినిమా చేయాలని అనుకుంటున్నారు. సీతారామరాజు చేయనా అనడిగితే ఆడియెన్స్ నుండి సరైన రెస్పాన్స్ రాలేదు. జేంస్ బాండ్ సినిమా అంటే ఓకే అన్నారు.

సో మహేష్ ను అలా చూడటానికి ఇష్టపడట్లేదని చరణ్ కు ఈ ఛాన్స్ ఇచ్చానని.. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు చేయనని చెప్పినా సినిమా ఆపేసి వేరే కథతో వచ్చే వాడినని అన్నారు రాజమౌళి. కచ్చితంగా ఆర్.ఆర్.ఆర్ అనౌన్స్ మెంట్ మహేష్ కు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిందని చెప్పొచ్చు. సీతారామరాజు, కొమరం భీం ఇద్దరు ఫ్రీడం ఫైటర్స్ గా మారకముందు ఏం చేశారు అన్నది ఆర్.ఆర్.ఆర్ కథ. మరి ఆర్.ఆర్.ఆర్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

amazon ad