మరోసారి టీఆర్‌ఎస్ సర్కారుపై నిప్పులు చెరిగారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. ఆమె చేస్తున్న పాదయాత్ర నేడు 3వేల మైలురాయిని చేరుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె మంచిర్యాలలో మాట్లాడుతూ.. నడిచింది నేనే అయినా… నడిపించింది మీ అభిమానమేనన్నారు. అంతేకాకుండా.. YSR ముఖ్యమంత్రిగా ఉన్నది 5 ఏళ్లు మాత్రమే. 5 ఏళ్లలో ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయని పథకాలు ప్రవేశ పెట్టాడు. పైసా ఖర్చు లేకుండా అరోగ్య శ్రీ తో పెద్ద పెద్ద ఆపరేషన్ లు జరిగాయి. 5 ఏళ్లలో 46 లక్షల పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు కట్టించారు. లక్షల ఎకరాల్లో పోడు భూములకు పట్టాలు ఇచ్చారు.. ఎంత రుణం ఉంటే అంతా మాఫీ చేశారు. ప్రతి వర్గాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. నాయకుడు అంటే YSR. ముఖ్యమంత్రి అంటే వైఎస్సార్, ఇప్పుడు ఉన్నాడు ముఖ్యమంత్రి కేసీఅర్. ఇచ్చిన ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నాడా..? ఇంటికో ఉద్యోగం,డబుల్ బెడ్ రూం ఇల్లు,మూడు ఎకరాల భూమి,పోడు పట్టాలు,57 ఏళ్లకు పెన్షన్..ఇలా ప్రతి హామీ మోసమే మైనారిటీలకు 12 శాతం అని పెద్ద మోసం. కేసీఅర్ మోసగాడు.. ఒక 420. ఇంత దగా చేస్తే 420 ఆనక ఏమంటారు. చెప్పేవి శ్రీరంగ నీతులు..చేసేవి పనికి మాలిన పనులు. నా MLA లను బీజేపీ కొనేసుకుంటుంది అని దండాలు పెడుతున్నాడు. మొకరించి నన్ను ..నా పార్టీ నీ కాపాడండి అని చేతులు జోడించి వేసుకుంటున్నాడు.
ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తుంది అని ఆరోపించాడు. సంతోషం…ఇప్పుడైనా బీజేపీ గురించి నిజాలు మాట్లాడుతున్నాడు. కానీ మునుగోడు లో కేసీఅర్ చేసింది ఏమిటి..? మునుగోడు లో ఒక్కో ఓటు ను వేలు పెట్టి కొన్నాడు కదా. నల్లా తిప్పితే నీళ్ళ కన్నా లిక్కర్ వచ్చింది కదా. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం ఆనరా…?.ఒక్కో సర్పంచ్ కి..ఎంపీటీసీ ,ZPTC కి కోట్లు ఇచ్చి కొన్నారు కదా..? దీన్ని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అనారా..? కేసీఅర్ మునుగోడు లో ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసి ఖూనీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే లను కొన్నప్పుడు ప్రజా స్వామ్యం ఖూనీ చేసినట్లు కాదా.. అప్పుడు కనిపించలేదా ప్రజాస్వామ్యం… అప్పుడు గుర్తుకు రాలేదా ప్రజా స్వామ్యం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లను ఈయన కొంటె తప్పు లేదట.. ఇప్పుడు ఈయన mla లను బీజేపీ కొనాలని చూస్తే తప్పా. ఈయన చేస్తే ఒప్పు ..బీజేపీ చేస్తే తప్పా.. ఈయన చేస్తే సంసారం ..పక్కనొడు చేస్తే వ్యపిచారమ..? దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలా ఉంటుందో కేసీఅర్ మాట్లాడితే అంత కన్నా అసహ్యం గా ఉంది. ఏ వర్గాన్ని ఆదుకున్నారు కేసీఅర్ గారు.. తెలంగాణ లో వ్యవసాయాన్ని పూర్తిగా బ్రష్టు పట్టించారు కదా.. 35 వేలు ఇచ్చే సబ్సిడీ పథకాలు బంద్ పెట్టి ముష్టి 5 వేలు ఇస్తున్నారు’ అంటూ ఆమె విమర్శలు గుప్పించారు.