హెల్ప్ లైన్ నెంబర్ కూడా మొదలుపెట్టిన షర్మిల

దేశంలో ఇప్పుడు ఆర్ధికంగా ఇబ్బంది పడే వాళ్లకు ఎవరో ఒకరు ఎంతో కొంత సహాయం చేస్తున్నారు. రాజకీయంగా బలపడాలి అని భావించే వారు ఇలా సహాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సహాయం కావాల్సిన వాళ్ళు తమ వద్దకు రావాలని ఎవరి విజ్ఞప్తి వాళ్ళు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణాలో బలపడాలని భావిస్తున్న వైఎస్ షర్మిల కూడా సహాయం చేస్తున్నారు.

తాజాగా ఆమె ఒక హెల్ప్ లైన్ నెంబర్ ని కూడా మొదలుపెట్టారు. తెలంగాణ ఆడబిడ్డలారా… దైర్యం కోల్పోకండి అని ఆమె ఒక ప్రకటన చేసారు. క‌రోనా తో కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయిన మ‌హిళ‌ల‌ను అండ‌గా ఉంటా అని హామీ ఇచ్చారు. వారి బాధను కాస్తయినా పంచుకోవడానికి ఆర్థికంగా నా వంతుగా సహాయం చేస్తా అని అన్నారు. స‌మాచారం అందించాల్సిన నెంబ‌ర్ 040-48213268 అని ఆమె నెంబర్ ని ప్రకటించారు.