లాక్ డౌన్ తో ఆ రోగాలు కూడా రాలేదా…?

ఇటీవలి కాలంలో కోవిడ్ -19 కారణంగా విధించిన లాక్‌డౌన్ల వల్ల న్యుమోనియా, మెనింజైటిస్ మరియు సెప్సిస్ వంటి బ్యాక్టీరియాతో వచ్చ్హే వ్యాధులు తగ్గాయని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నేతృత్వంలోని నిర్వహించిన అధ్యయనం ఒకటి తెలిపింది. అంటు వ్యాధి నిపుణుడు మరియు క్రైస్ట్‌చర్చ్‌లోని ఒటాగో విశ్వవిద్యాలయం డీన్ ప్రొఫెసర్ డేవిడ్ ముర్డోచ్ సహ రచయితగా… ఈ అధ్యయనం విడుదల చేసారు.

lockdown

అధ్యయనం ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్లు ఘోరమైన ఇన్వాసివ్ బ్యాక్టీరియా వ్యాధుల వ్యాప్తిని తగ్గించాయి అని మిలియన్ల మంది ప్రాణాలను రక్షించాయి అని వెల్లడించారు. ఇన్వాసివ్ బ్యాక్టీరియా వల్ల కలిగే సర్వసాధారణమైన అనారోగ్యాలు – న్యుమోనియా, మెనింజైటిస్ మరియు సెప్సిస్… ఇవి మరణాలకు కూడా దారి తీస్తాయి. నివేదిక ప్రకారం, 2016 లో 2.4 మిలియన్ల మంది ప్రజలు ఈ అనారోగ్యాల కారణంగా మరణించారని తెలిపారు.