క్లౌడ్ బస్టర్ అని..బోడి గుండుకు మోకాళ్ళకు ముడేసిండు – షర్మిల

-

తెలంగాణ సీఎం కేసీఆర్‌ వరదలపై చేసిన కామెంట్స్‌ పై వైఎస్‌ షర్మిల కౌంటర్‌ ఇచ్చారు. క్లౌడ్ బస్టర్ అని..బోడి గుండుకు మోకాళ్ళకు ముడేసిండని చురకలు అంటించారు షర్మిల. వారం రోజుల వానల తర్వాత వరద బాధితులకు చూసేందుకు ఇయ్యాల తీరింది దొరకు. హెలీకాప్టర్ లో ఏరియల్ సర్వే చేసి, తెలంగాణపై విదేశీ కుట్ర జరుగుతోందని సెలవిచ్చిండని మండిపడ్డారు.

వానలు, వరదలు రావడానికి క్లౌడ్ బస్టర్ అని కాకమ్మ కథ చెప్పి , బోడి గుండుకు మోకాళ్ళకు ముడేసిండు. విదేశీ కుట్రల మీద సమాచారం ఉన్న సారుకు.. వరద నష్టం మీద ఎంత సమాచారం అందిందో? లక్షల్లో ఆస్తి నష్టపోయి, గూడు లేని, తిండి అందని వరద బాధితులకు 10వేల సాయం ప్రకటించిండని మండిపడ్డారు. సారు..ఈ సాయమన్న అందుతుందా ? GHMC లో వరద సాయమని మీ గులాబీ లీడర్లే మింగినట్టు మింగుతారా? వరంగల్లో ఇస్తామని మరిచినట్టు ఇది కూడా ఉత్త హామీనేనా? అని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news